Homeవినోదంపెద్ది లో శృతి హాసన్ సాంగ్ రెమ్యునరేషన్ ఎంతంటే?

పెద్ది లో శృతి హాసన్ సాంగ్ రెమ్యునరేషన్ ఎంతంటే?

పెద్ది లో శృతి హాసన్ సాంగ్
రెమ్యునరేషన్ ఎంతంటే?

పెద్ది సినిమా పై విప‌రీత‌మైన బ‌జ్ న‌డుస్తోంది. హీరో రామ్ చ‌ర‌ణ్ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈనెలాఖ‌రున విడుద‌ల కావాల్సి ఉంది. కానీ కొన్ని కార‌ణాల‌తో చిత్రం వాయిదా ప‌డింది. ఇటీవ‌ల బుచ్చిబాబు ఓ సినిమా ఈవెంట్లో ఈ చిత్రం జూన్ 25 న రిలీజ్ చేస్తాము అని ప్ర‌క‌టించారు. ఇక ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వ‌స్తుందా అని ఎదురుచూస్తున్నారు, ఇక ఈ చిత్రం టాకీ అంతా పూర్తి అయింది. కేవలం ఒక్క సాంగ్ మాత్ర‌మే పెండింగ్ లో ఉంది. ఇటీవ‌ల ఆ సాంగ్ షూటింగ్ కూడా మొద‌లైంది.
తాజాగా శృతిహాస‌న్ రామ్ చ‌ర‌ణ్ ఈ సాంగ్ చేస్తున్న కొన్ని వీడియోలు బ‌య‌ట‌కు లీక్ అయ్యాయి. వీటిని చూసి ఈ సినిమాలో శృతిహాస‌న్ స్పెష‌ల్ సాంగ్ చేస్తున్నారు అనేది క్లారిటీ వ‌చ్చింది.

అయితే ఎవ‌డు సినిమాలో గ‌తంలో వీరిద్ద‌రు న‌టించారు. ఈ ఇద్ద‌రు చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి న‌టిస్తుండ‌టంతో ఫ్యాన్స్ ఈ జోడి స్టెప్పుల కోసం చూస్తున్నారు. ఇక ఈ సినిమా స్పెష‌ల్ సాంగ్ మ‌రో రెండు రోజుల్లో పూర్తి అవ్వనుంది. ఈ సాంగ్ ని ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ కంపోజ్ చేస్తున్నారు. ఇక ఏ ఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకి అద్భుత‌మైన బాణీలు అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ క‌పూర్ న‌టిస్తుండ‌గా స్పెష‌ల్ సాంగ్ కోసం శృతిని తీసుకున్నారు. ఈ సినిమాలో ఒక్క పాట కోసం శృతి ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంది అనే టాక్ బాగా న‌డుస్తోంది. తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న దాని ప్రకారం, ఒక్క సాంగ్ కి ఆమె ఐదు రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ. కోటిన్న‌ర రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు అంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments