Homeవ్యాపారంవ‌ర‌ల్డ్ లో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు

వ‌ర‌ల్డ్ లో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు

వ‌ర‌ల్డ్ లో అత్యధికంగా
బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు

బంగారం అంటే ఇష్టం లేని వారు ఎవ‌రు ఉంటారు చెప్పండి, ఆభ‌ర‌ణాల‌తో పాటు బంగారు కాయిన్స్ బిస్కెట్ల రూపంలో కూడా దాచుకుంటారు. ఇక బ్యాంకులు కూడా త‌మ డిపాజిట్ల రూపంలో బంగారు బిస్కెట్ల‌ని ఇన్వెస్ట్ మెంట్ గా పెట్టుకుంటాయి. అందుకే ట‌న్నుల కొద్ది బంగారం ఆయా దేశాల రిజ‌ర్వ్ బ్యాంకుల ద‌గ్గ‌ర ఉంటుంది. ఎలాంటి ఆర్దిక సంక్షోభ ప‌రిస్దితి ఎదురైనా త‌మ క‌రెన్సీ విలువ ప‌డిపోయినా ఆ బంగారంతో చెల్లింపులు చేస్తుంది. సో మ‌న దేశంలో అయితే ఆభ‌ర‌ణాలు పెద్ద మొత్తంలో మ‌హిళ‌లు కొంటారు. అయితే ఇంత పెద్ద ఎత్తున బంగారం వినియోగిస్తున్న భార‌త్ అస‌లు ఉత్ప‌త్తిలో మాత్రం చాలా లాస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

మ‌రి పెద్ద ఎత్తున బంగారం ఉత్ప‌త్తి చేస్తున్న దేశాలు ఏమి ఉన్నాయి అనేది ఓసారి చూద్దాం. టాప్ 10 లిస్ట్ ని ఓసారి పరిశీలిద్దాం.

వ‌ర‌ల్డ్ లో ఎక్కువ బంగారం ఉత్ప‌త్తి చేసే దేశం చైనా, అక్క‌డ మైనింగ్ అలాగే బంగారం గ‌నుల నుంచి శుద్ది చేసి ప్ర‌పంచంలో ఎక్కువ ఉత్ప‌త్తి చేస్తుంది. సుమారు 388 టన్నుల బంగారం ఉత్ప‌త్తి జ‌రుగుతోంది.

ఇక రెండో స్ధానంలో ర‌ష్యా నిలిచింది సుమారు 339 ట‌న్నుల వ‌ర‌కూ ఉత్ప‌త్తి చేస్తోంది.

ఆస్ట్రేలియా 3 స్ధానంలో ఉంది దాదాపు 280 ట‌న్నుల‌తో నిలిచింది

కెన‌డా 230 టన్నుల‌తో నాలుగో స్ధానంలో ఉంది

అమెరికా 165 టన్నుల‌తో ఐదో స్ధానంలో ఉంది

ఆఫ్రికా ఖండంలో ఘ‌నా 149 ట‌న్నులతో ఆరోస్దానంలో నిలిచింది

మెక్సికో దాదాపు 130 ట‌న్నుల‌తో 7 వ‌స్ధానంలో నిలిచింది

ఇండోనేషియా 123 ట‌న్నుల‌తో 8 వ ప్లేస్ లో నిలిచింది

దక్షిణ అమెరికాలోని పెరూ 118 టన్నుల బంగారం తో 9 వ ప్లేస్ లో నిలిచింది

ఇక చివ‌ర‌గా ఉజ్బెకిస్తాన్ 109 టన్నుల బంగారం ఉత్పత్తితో 10 వ ప్లేస్ లో ఉంది

ఇక్క‌డ మ‌నం ఒక‌టి గ‌మ‌నించాలి చైనా అనేది ప్ర‌పంచంలో ఎక్కువ బంగారం ఉత్ప‌త్తి చేసే దేశం. అయితే బంగారం నిల్వ‌లు మాత్రం చైనా ద‌గ్గ‌ర తక్కువ ఉన్నాయి. అమెరికా ద‌గ్గ‌ర ఎక్కువ నిల్వ‌లు ఉన్నాయి. ఇక మ‌న దేశం అస‌లు బంగారం ఉత్ప‌త్తిలో చాలా లీస్ట్ లో ఉంటుంది. కానీ బంగారం వినియోగం , కొన‌డంలో, నిల్వ‌లో, దిగుమ‌తిలో మాత్రం అంద‌రి కంటే ముందు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments