మన దేశంలో ప్రభుత్వ భీమా సంస్దగా ఎల్ ఐసీ కొన్ని కోట్ల మంది నమ్మకం సొంతం చేసుకుంది. భీమా అంటే ఎల్ ఐసీ అంటారు చాలా మంది. పెట్టుబడి పొదుపు, బీమా ఇలా మూడు రంగాల్లో ఎల్ ఐసీ ప్రజల నమ్మకం సొంతం చేసుకుంది. అయితే పెద్దలకే కాదు పిల్లలకు కూడా అనేక పాలసీలు ఎల్ ఐసీ అందిస్తోంది. అందులో ఓ ముఖ్యమైన పాలసీ గురించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఎలా పొందాలి అనేది ఈ ఆర్డికల్ లో మనం తెలుసుకుందాం.
పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఎల్ ఐ సీ ఓ బెస్ట్ ప్లాన్ తీసుకువచ్చింది. దాని పేరు LIC New Children Money Back Plan మీరు ఇందులో తక్కువ మొత్తం నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు.
ఉదాహరణతో మనం చూద్దాం** మీరు రోజుకి 150 రూపాయలు కడితే నెలకి 4500 అవుతుంది. ఇలా పెట్టుబడిని ఎక్కువకాలం ఉంచితే మీకు మంచి రిటర్న్ అందిస్తుంది. మీరు సంవత్సరానికి 54 వేలు కడతారు. ఇలా 25 సంవత్సరాలు కడితే మీరు మొత్తం 13,50000 కట్టినట్టు. ఇక మీ పిల్లలపై కట్టే ఈ పాలసీకీ మెచ్చూర్ సమయం పూర్తి అయ్యాక బోనస్ భారీగా వస్తుంది. మొత్తంగా మీ పిల్లలకు 19 లక్షల రూపాయల వరకూ అందుతాయి.ఇక భరోసా ఉంటుంది మీరు కట్టిన డబ్బులు ఎక్కడికి పోవు. అంతేకాదు మీ పిల్లలు ఉన్నత విద్యకి పెళ్లికి ఈ నగదు ఉపయోగించుకోవచ్చు. పిల్లలకు 18,20,22 ఏళ్లు వచ్చాక కట్టినదాని నుంచి 20 శాతం నగదు కూడా చెల్లిస్తారు, మిగిలిన 40 శాతం చివరన తీసుకోవచ్చు బోనస్ తో కలిపి.
మీ పిల్లలకు ఒక సంవత్సరం నుంచి 12 సంవత్సరాల వయసులో ఎప్పుడైనా దీనిని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు మూడు నెలలకు ఆరునెలలకు లేదా ఏడాదికి ఈ నగదు జమ చేసుకోవచ్చు. ఇక కనిష్టంగా ఒక లక్షరూపాయల వరకూ దీనిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్టంగా మీరు ఎంతైనా కట్టవచ్చు. మొత్తం ఈపాలసీకి టైమ్ 25 సంవత్సరాలు. మధ్యలో ఈ పాలసీ బ్రేక్ చేసినా కొంత నగదు చార్జీల కింద పోయి మీరు కట్టిన నగదు మీకు రావడం జరుగుతుంది.
.

